
లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) 131 డివిజన్ బాపు నగర్ వాసులు పరిపటి అజిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/- ల ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ని మంజూరు చేయించి ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాపు నగర్ వాసులు పరిపటి అజిత కి – రూ 60,000/- ల CMRF-మంజూరి పత్రాన్ని (చెక్కు) అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
