
ముఖ్యమంత్రి సహాయ నిధి…. నిరుపేదల పాలిటి పెన్నిధి…
చింతల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని జిహెచ్ఎంసి, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ, కొంపల్లి మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన దాదాపు 139 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు సుమారు 47 లక్షల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయా డివిజన్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధ్యక్షులు, నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఆపదలో ఉన్న ప్రతీ ఒక్క నిరుపేదను అదుకుంటూ భరోసా కల్పించే నాయకులు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అని అన్నారు. అనారోగ్య సమస్యతో ఆసుపత్రుల పాలై ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సహాయనిధి గొప్ప వరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మహమ్మద్ రషీద్ రఫీ, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, కెఎం.గౌరిష్, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, రుద్ర అశోక్, ఎర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మక్సుద్ అలీ, గుబ్బల లక్ష్మీనారాయణ, శేఖర్ రావు, గౌస్, బస్వరాజు, సంపత్ మాధవ రెడ్డి, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, కిషోర్ చారి, ప్రభాకర్ గుప్తా, మహమ్మద్, అజం, ఓంకార్ రెడ్డి, నదీమ్ రాయ్, బొంబాయి శ్రీను, ఈశ్వర్ గౌడ్, ప్రకాష్ లింగాయత్, తోకల నగేష్ రెడ్డి, సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, యేసు, విజయ్ హరీష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
