Spread the love

చిలకలూరిపేట రూరల్ పసుమర్రు గ్రామములోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జనసేనపార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్ పరిశీలించారు.ఆహార నాణ్యతను, ఎంత విద్యార్థులకు పెడుతున్నారో తనిఖీ చేశారు.విద్యార్థుల నుండి అభిప్రాయాలను రాజారమేష్ అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని,స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో అన్ని విషయాలలో ప్రజలకు సంతృప్తి పరిపాలనను అందిస్తున్నామని, ఎవరైనా అవినీతికి పాల్పడిన వారిపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజారమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్ తేజ,మండల, పట్టణ అధ్యక్షులు పఠాన్ ఖాదర్ భాషా, షేక్ మునీర్ హస్సన్, రాజేష్ నాయక్, అయ్యప్ప స్వామి, వెంకటప్పయ్య మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.