TEJA NEWS

గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సత్కరించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు

అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం.
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.

ఆషాడమాసం, బహుళ పౌర్ణమిని పురస్కరించుకొని చిలకలూరిపేట లోని తెలుగు రచయిత గురువులను బిజెపి నాయుకులు ఘనంగా సత్కరించారు చిలకలూరిపేట బిజెపి నాయకులు గురుపౌర్ణమి పర్వదినమును ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా తమ తెలుగు రచయిత గురువులు పీవీ సాంబశివరావును, తెలుగు బాల సాహిత్య రచయిత దార్ల బుచ్చిబాబు ను ఘనంగా సత్కరించారు. సందర్భంగా గురువులు నేర్పిన,విద్యను ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా కనీసం ఒక గంట పాటు అభ్యాసం చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి అయినా సరే ఆ సరస్వతి దేవి అనుగ్రహం పొందగలరు మరొక మారు . క్రమశిక్షణతో కూడిన విద్యకు, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతుందని, నియమిత ఆహారం, సమయపాలన, ప్రశాంతమైన నిద్ర మనిషి మానసిక శారీరక ఉన్నతికి తోడ్పడతాయని ఈ సందర్భంగా సన్మానితులు మాట్లాడారు పివి సుబ్బారావు విన్సెంట్ పాల్ గోలి నాగేశ్వరావు గార్ల కు సన్మానం చేయడం జరిగింది గురువులు దార్ల బుచ్చి బాబు కు సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గ కన్వినర్ జయరాంరెడ్డి కో కన్వినర్ మల్లెల శివనాగేశ్వరరావు రాష్ట్ర నాయకులు పరంకుశం శ్రీనివాస్ చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ చిలకలూరిపేట రూరల్ ప్రెసిడెంట్ గోరంట్ల పిచ్చయ్య ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అధిములం గురుస్వామి
పల్నాడు జిల్లాకార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, ఉప్పాల భాస్కరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, రావికింది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు