TEJA NEWS

అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమంలో చిలకలూరిపేట కమిషనర్ పీ. శ్రీ హరిబాబు

చిలకలూరిపేట :కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్21వరకునిర్వహించనున్నారు.ఇందులో భాగంగాపురపాలక సంఘ కార్యాలయంలో ఉన్న మైలవరపు గుండయ్య మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు మాట్లాడుతూ యోగ యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయనీ పేర్కొన్నారు. 

యోగా యొక్క సాధారణ అభ్యాసం బలం, వశ్యత మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మానసిక స్పష్టతను పెంచుతుందనీ తెలిపారు. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యతఆరోగ్యంమెరుగుపడతాయి అని తెలియజేశారు.