
చిలకలూరిపేట 29వ వార్డులో రోడ్లు, కాలువల పరిశీలన
చిలకలూరిపేట మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే మరియు అభివృద్ధి ప్రదాత అయిన పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 29వ వార్డులోని రోడ్లు మరియు కాలువలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) రహీం, పదో వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జానీ, మోదిన్, చంద్ర, ముటాకరిముల్లా, వార్డు ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
