TEJA NEWS

చిలకలూరిపేట మురుగు కాల్వల పారుదల, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు శుక్రవారం నాడు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్ హాల్ నందు పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పనుల పై మున్సిపల్ కమిషనర్ పీ.శ్రీహరి బాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని గారు మాట్లాడుతూ మనందరి ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆలోచనలకు అనుగుణంగా వారి ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధికి,
పరిసరాల పరిశుభ్రత ,ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛ చిలకలూరిపేట,
పట్టణ శివారు ప్రాంతాల్లో సైతం స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనీ అన్నారు. శాసనసభ్యుల వారి ఆదేశాలను బేఖాతర్ ఎవరు చేసిన ఉపేక్షించేది ఉండబోదని ఇప్పటికే పలుమార్లు చెప్పటం జరిగింది,


తిరు మారని అధికారుల పై దృష్టి సారించవల్సిందిగా కమిషనర్ పీ శ్రీహరిబాబు ను కోరారు,పారిశుద్ధ్య సమీక్ష సమావేశంలో శానిటేషన్ అధికారులు, సెక్రటరీలు, మేస్త్రులను ఉద్దేశించి ఈ విధమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అత్యధికంగా నిధులు వెచ్చిస్తున్న అనుకున్న మేర లక్ష్య సాధనలో శానిటేషన్ అధికారులు వైఖరి కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని,మున్సిపల్ కౌన్సిలర్లు,పుర ప్రముఖులు మౌలికంగా ఫిర్యాదులు వ్యక్తం చేస్తున్నారని ,పారిశుధ్య సిబ్బంది సరిగా పనిచేయడం లేదా..? ప్రతి వార్డు పరిధిలో ఉన్న శానిటేషన్ సెక్రటరీ లు మేస్త్రులు ఏమి చేస్తున్నారు ..? వీరి ద్వారానే కదా ఆయా వార్డుల్లో రోజు పారిశుధ్య పనుల నిర్వహణ జరుగుతుంది, అయినా కానీ ఎందుకు మెరుగు అవటం లేదని శానిటరీ ఇనస్పెక్టర్ ల పై అసహనం వ్యక్తం చేశారు.పారిశుధ్య కార్మికుల హాజరు చూస్తే ఫుల్లుగా ఉంటుంది విధులు నిర్వహణ అంతంత మాత్రం ఉంటే ఎలా అని మండిపడ్డారు, పారిశుధ్య పనుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన అలక్ష్యంగా ఉన్న తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని, పారిశుధ్య నిర్వహణ క్షేత్ర స్థాయి నుండి శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు పరివేక్షణ చేయాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు..