
చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయలో చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ బీ.సీ సెల్ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గా సమాజంలో అణగారినవర్గాలకు, మహిళలకు విద్యను బోధించి వారి అభ్యున్నతికి బాటలు వేశారు, రానున్న రోజుల్లో కూడా వారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాలి అనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరిముళ్ల , భీమవరపు సుబ్బారావు , మద్దిబోయిన శివ , తుపాకుల అప్పారావు ,కందుల వెంకట రమణ ,చింతకాయల కోటేశ్వరరావు , కంచర్ల శ్రీనివాసరావు , కొండా శ్రీనివాసరావు , పఠాన్ సమద్ , ముద్దమాల రవి , మురుకొండా మల్లి బాబు , పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.*
