
మీ ఫామ్ హౌస్ లెక్కలు తేల్చు కేసీఆర్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
నాగర్కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు 42% ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా గొప్ప విషయమని ఇది అందరు చేసే పని కాదని, ఇది కేవలం మన ప్రాంతానికి చెందిన మన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు,ఒక పట్టుదలతో చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు, ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న పోరాటాలు చేస్తున్న గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని,పట్టీ పట్టనట్టుగా చూస్తూ కూర్చున్నారే తప్ప ఎలాంటి కులగణన చేయలేదని ఎలాంటి వర్గీకరణ చేయలేదని ఎవరి వల్ల సాధ్యం కాలేని పనిని ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైందని అన్నారు, గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించింది, ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ నువ్వు ఇప్పుడు కులగణన పేరుతో మోసం చేసిందని అంటున్నావ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ కుల గణన జరిగిందని, కానీ కెసిఆర్ నువ్వుఏమంటున్నావు కులగనన కరెక్ట్ గా జరగలేదని అంటున్నావ్ నీ పాలనలో ఏం జరిగింది.అంటూహెచ్చరించారు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
