Spread the love

చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం కావూరు గ్రామానికి చెందిన కోమటినేని మురళి కృష్ణ కి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయనిధి నుండి 5 లక్షల రూపాయల LOC ను మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.
అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ప్రభుత్వం అని, ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం అధ్యక్షులు జవ్వాజి మదన్ పాల్గొన్నారు…