సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఆయన… బాపట్ల, కృష్ణా, పల్నాడు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇటు, మంత్రులు, అధికారులు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
