
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి సీఎం ఇక రాలేరు
** స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మాజీ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి
పూతలపట్టు(తిరుపతి): తన ప్రాణం ఉన్నంతవరకు
పేద, బడుగు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆయనలాంటి పరిపాలనా దక్షత కలిగిన సీఎం ఇకపై రాలేరేమోనని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర నేత అండ్ స్త్రీ – శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ శైలజా చరణ్ రెడ్డి అన్నారు. డాక్టర్ వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తడక జగదీశ్వర్ గుప్తతో కలసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శైలజా చరణ్ రెడ్డి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు అని కొనియాడారు. ఆ మహానేత మననుంచి దూరమై 16ఏళ్ళు అవుతున్నా ఆయన చేసిన సేవ, పథకాల అమలుతో ఎదురులేని వ్యక్తిగా సాగారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, రెండు రూపాయలకే కిలోబియ్యం వంటి పథకాలు ఇప్పటికీ ఉన్నాయాంటే ఆయన దూరదృష్టి అర్థం అవుతుందన్నారు. అందుకే రాజశేఖరరెడ్డి ప్రజల గుండె చప్పుడు అని తెలిపారు. ఇదే సందర్బంగా “మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం” లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు హరినాథ్ గౌడ్, సాయి కిరణ్ రెడ్ది, శ్రీమన్నారాయణ, పలువురు అభిమానులు పాల్గొన్నారు.
