బుధ. మార్చి 11th, 2026

మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి

WhatsApp Image 2025 03 28 at 13.07.58
WhatsApp Image 2025 03 28 at 13.07.58
TEJA NEWS

మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:
త‌న ప‌రిపాల‌నా దీక్ష నైపుణ్యం.. ప్ర‌భావంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కునిగా నిలిచారు. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్య‌ధిక శ‌క్తిమంతులైన 100 మంది ప్ర‌ముఖుల‌తో జాబితా విడుద‌ల చేసింది.

ఈ జాబితాలో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం ద‌క్కించుకున్నారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగ‌బాకి 28వ స్థానానికి చేరుకోవ‌డం విశేషం.

దేశంలో రాజ‌కీయ‌, వ్యా పార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది.

త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డింది. ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌ వించారు.

ఈ జాబితాతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూట‌మిలోని ఇతర ప్ర‌ముఖులైన సీఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీల‌క నాయ‌కునిగా నిలిపేలా చేశాయి.

శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణ‌వ్‌, బీజేపీయే త‌ర రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, సిద్ధరా మయ్య వంటి నేత‌లు తొలి 25 మందిలో ఉన్నారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page