
అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రాక
నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత న్యూస్ ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలను పట్టించుకోలేదని, విమర్శించారు, అంతేకాకుండా ఈనెల 18 అచ్చంపేట నియోజకవర్గం లో మున్ననూరుకు రానున్నారని, మున్నూరులో గిరి సౌర జల వికాస్ పథకాన్ని ప్రారంభిస్తారని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని వివిధ పథకాలకు లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందన్నారు, ఈ ఇందిర జల సౌర వికాస్ పథకం ద్వారా గిరిజనులు అభివృద్ధికి,వారి సంక్షేమం కోసం,వారు ఆర్థికంగా బలపడడానికి తోడ్పాడుతుంది అని ఎంపీ మల్లు రవి తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ ,కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
