
అసెంబ్లీకి సీఎం రేవంత్
మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ పర్యటనను ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇస్తారు. ఇక బీఆర్ఎస్ సభ్యుడి సస్పెన్షన్పై ఆ పార్టీ సభ్యులు ఆందోళన చేసే అవకాశం ఉంది. అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లు సమాచారం.
