
మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై సీఎం సమీక్ష
TG: మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 10న ప్రారంభం కానున్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు.
