TEJA NEWS

కోడెల అభివృద్ధి ఫలితాలు నేటికీ ప్రజలు అనుభవిస్తున్నారు : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • శివప్రసాదరావు జయంతి సందర్భంగా జరిగిన విగ్రహావిష్కరణలో ప్రత్తిపాటి

పల్నాడు పులిగా ప్రజల హృదయాల్లో నిలిచిన గొప్ప వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు చేపట్టి, ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి కోడెల అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. కోడెల వంటి మహానాయకుడి జయంతిని పురస్కరించుకొని, ఆయన రాష్ట్రానికి, పల్నాడు ప్రాంతానికి చేసిన సేవల్ని తెలుగుప్రజలు మననం చేసుకుంటారని, చరిత్ర ఉన్నంత కాలం కోడెల వారి హృదయాల్లో నిలిచేఉంటారని ప్రత్తిపాటి చెప్పారు. కోడెల శివప్రసాదరావు జయంతిని పురస్కరించుకొని నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కృష్ణదేవరాయలుతో కలిసి ప్రత్తిపాటి ఆవిష్కరించారు.