Spread the love

యూనివర్సిటీ టాపర్ కు పది వేల చెక్ అందజేసిన కాలేజ్ మేనేజ్మెంట్

ఎంజీయూ మూడో సెమిస్టర్ ఫలితాల్లో 10కి 10 జిపిఏ సాధించిన యాకమ్మ

విద్యార్థుల ప్రతిభకు మరింత ప్రోత్సాహం అందిస్తాం : మహర్షి డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్

సూర్యాపేట జిల్లా : ఉత్తమ ప్రతిభను కనబరిచే విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తామని మహర్షి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పల్లె నగేష్, కరస్పాండెంట్ నారాయణ ప్రవీణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇటీవల వెలువడిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ మూడవ సెమిస్టర్ ఫలితాల్లో 10కి 10 జిపిఏ సాధించి యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన కళాశాల విద్యార్థిని యాకమ్మకు రూ.10వేల చెక్కును అందించి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఏ సెమిస్టర్ లో నైనా 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, రూ.10వేలు అందజేస్తామని ప్రకటించినట్లు తెలిపారు.గతంలో తాము ప్రకటించిన విధంగానే 10కి 10 జీపీఏ సాధించిన యాకమ్మకు పదివేల రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు. చదువులో ప్రతిభను కనబరిచే విద్యార్థులకు తాము అండగా ఉంటూ మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.