
కెపిహెచ్ బి డివిజన్లోని కాలనీలోని ఇండస్ విల్లాస్ స్థానికుల ఫిర్యాదు మేరకు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ..అధికారులతో కలిసి డివిజన్లోని ఇందు విల్లాస్ వద్ద స్ట్రోమ్ వాటర్ కి సంబంధించి నూతన పైప్ లైన్ నిర్మాణంలోని పనులను పరిశీలించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు విషయమై ఎటువంటి ఇబ్బంది ఉన్న తమను సంప్రదించాలని అభివృద్ధికి ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి, రాజేష్, అధికారులు డిఈ శంకర్ ,ఏఈ సాయి ప్రసాద్ ,HMWS మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు…
