
కావూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు..
ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలు జి.దేవి తనిఖీ
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని కావూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలు జి.దేవి ఈరోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా, “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం” కింద విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.ఈ సందర్భంగా విద్యార్థులు రాగి జావా రుచిగా ఉండటం లేదని, అలాగే అన్నం సరిగ్గా ఉడకడం లేదని ఫిర్యాదు చేశారు.విద్యార్థుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన దేవి, అక్కడే ఉన్న నరసరావుపేట జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) చంద్రకళ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలను సరిదిద్దాలని, భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు వస్తే మెమో జారీ చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.తనిఖీ అనంతరం జి.దేవి సాయంత్రం 4:10 గంటలకు నరసరావుపేట వైపు వెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఈవో చంద్రకళ కూడా పాల్గొన్నారు. ఈ ఆకస్మిక తనిఖీతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది.
