
స్మార్ట్ సిటీ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి.
స్మార్ట్ సిటీ ఎం.డి. ఎన్.మౌర్య
స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను, ప్రాజెక్టుల ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ లో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల్లో పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గరుడ వారధిలో కూడళ్లు, డివైడర్లు, గోడల సుందరీకరణ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టి లెవెల్ కార్ పార్కింగ్, తదితర ప్రాజెక్టులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు చంద్రశేఖర్, శ్యాంసుందర్, డి.ఈ.లు రాజు, మహేష్, మధు, ప్రసాద్, ఏ.ఓ. రాజశేఖర్, సి.ఎఫ్.ఓ. మల్లికార్జున, ఏ ఈ కాం ప్రతినిధులు బాలాజి, అనిల్, అఫ్కాన్స్ ప్రతినిధి స్వామి, ఐ ట్రిపుల్ సి, మల్టి లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుల ప్రతినిధులు ఉన్నారు.
