బుధ. మార్చి 11th, 2026

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి

WhatsApp Image 2025 04 15 at 17.03.09
WhatsApp Image 2025 04 15 at 17.03.09
TEJA NEWS

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ మరియు గాజుల రామారం సర్కిళ్లకు చెందిన ఇంజనీరింగ్ విభాగం అధికారులతో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….జంట సర్కిళ్ల పరిధిలో అన్ని డివిజన్లలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను చేపట్టేందుకు సర్కిల్ కు 7 కోట్ల రూపాయల చొప్పున దాదాపు 14 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని వారు అధికారులకు తెలిపారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో వేలకోట్ల రూపాయల నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన పనులను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి సమస్య పరిష్కారానికి కృషిచేయాలని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి సామాన్య ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా చూడాలని తద్వారా నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలిపేందుకు అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ ఈఈ లు లక్ష్మీ గణేష్, డీఈ పాపమ్మ, శిరీష, రూపా దేవి, ఏఈలు కళ్యాణ్, తిరుపతి, అనురాగ్, అశోక్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page