
పాతకోట సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీసీఎఫ్
అసంఘటిత కార్యకలాపాలకు అడ్డగా మారిన మార్కెట్ ప్రాంతాన్ని పోలీసులు పెట్రోలింగ్ చేపట్టాలని డిమాండ్
వనపర్తి
జిల్లా కేంద్రం గాంధీ చౌక్ కందకం వద్ద గత పాలకుల హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన
సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ కు : వెనుకబడిన కులాల సమాఖ్య (BCF) ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అనంతరం బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నా రాములు మాట్లాడుతూ పట్టణంలోని పాతకోట లో అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి సత్వరమే నిధులు కేటాయించి మిగిలిన పని పూర్తి చేయడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ప్రజలు చిరు వ్యాపారులు ఈ మార్కెట్ వల్ల జీవనోపాధి పొందే అవకాశం ఉంది అంతే కాకుండా వనపర్తి పాత బజార్ గాంధీ చౌక్ ప్రజలకు ఈ మార్కెట్ నిర్మాణం వల్ల కూరగాయలు చేపలు మాంసం ఆహార సరుకులు సరసమైన ధరలకు అందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ కూరగాయల మార్కెట్లో పక్కన గల ప్రజలకు కూడా సౌకర్య వంతంగా ఉంటుంది. ప్రస్తుతం సమీకృత మార్కెట్ నిరుపయోగంగా ఉండటం వల్ల యువకులు
మాదకద్రవ్యాలు గుట్కాలు గంజాయి సిగరెట్ పొగ తాగడం వంటి చర్యల వలన అసాంఘిక చర్యలకు అడ్డగా మారిపోయిందని దీంతో చుట్టుపక్కల మహిళలు కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయని పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేపట్టాలనిచుట్టుపక్కల ప్రాంతాల మహిళలు కోరుచున్నారని అలాగే . మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల, పాడుపడ్డ పరిస్థితుల వల్ల చెత్తాచెదారం పెరిగిపోయి కంపచెట్లు నుంచి పాములు తేళ్లు పందికొక్కులు పెరిగిపోయి చుట్టుపక్కల ఇళ్లల్లోకి వస్తున్నాయి పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కోట్ల రూపాయలు వెచ్చించి అసంపూర్తిగా నిర్మాణం చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది . అసంపూర్తి మార్కెట్ నిర్మాణం పనుల తో పాటు టాయిలెట్ సౌకర్యము పరిశుభ్రమైన శానిటేషన్ తోపాటు రవాణా కోసం వచ్చే ఆటోలు బొలెరోలకు రోడ్డు సౌకర్యము కల్పించాలని (BCF ) బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ నాయకత్వములో కలెక్టర్కు అందజేసిన వినతిపత్రంలో కోరినట్లు వాళ్ళు తెలిపారు . ఈ కార్యక్రమంలో BCF రాష్ట్ర కార్యదర్శులు అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపిటిసి, ఏర్పుల తిరుపతి యాదవ్. బీసీఫ్ జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ముదిరాజ్ ఇంటి కురుమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య యాదవ్ ఎస్ సి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేష్ శ్రీరంగాపురం మండలం మహిళా అధ్యక్షురాలు వీరపాగ కవిత నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
