Spread the love

అక్రమ అరెస్టులను ఖండించండి.
సిపిఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టినటువంటి ఇంద్ర పార్క్ ధర్నాను జయప్రదం చేయడానికి ఏ టి యు సి నాయకత్వం వెళుతున్నారని ముందస్తు సమాచారంతో నేడు ఉదయాన్నే జగద్గిరిగుట్ట పోలీసులు ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టయిన నాయకులను సిపిఐ నాయకత్వం పరామర్శించి ఈ అరెస్టులను ఖండించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలపై ఇచ్చిన జీవోను అమలు చేయాలని నేడు ఇంద్ర పార్క్ వద్ద అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. కార్మికులకు కనీస వేతనాలను ఇవ్వకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తే నాయకత్వాన్ని అరెస్టు చేయడం ప్రజా పాలన కాదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఈ ప్రభుత్వం అనుసరించడం తగదని కావున కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, అక్రమ అరెస్టులతో ప్రజల కోరికలను తీర్చలేరని, కావున వెంటనే ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రెస్ట్ అయినటువంటి సిపిఐ ఏఐటీయూసీ నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


అరెస్ట్ అయిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు హరినాథ్ రావు, కోశాధికారి సాయిలు, సిపిఐ కార్యదర్శి సహదేవరెడ్డి ఉన్నారు.
అరెస్ట్ అయిన వారికి సంఘీభావంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసింహ రెడ్డి, యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు రాములు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, కార్యదర్శి భాస్కరాచారి, సిపిఐ మండల కోశాధికారి సదానంద్, స్థానిక నాయకులు ప్రభాకర్, జంబు, సాగర్, గిరి, సామిల్, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.