
ఆస్తి పన్ను వసూళ్ల లో ప్రతిభ కనబరిచిన రెవెన్యూ అధికారులకు అభినందన ..
సాక్షిత చిలకలూరిపేట ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్, డి, ఎస్ హరికృష్ణ, చైర్మన్ షేక్ రఫానీ,*
స్థానిక పురపాలక సంఘ
కార్యాలయంలోనీ మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాల్ నందు 2024 _ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీకి చెల్లించవలసిన ఆస్తి పన్ను,ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లు లో చక్కని పురోగతి సాధించిన సందర్భంగా , మున్సిపల్ కమిషనర్ పీ .శ్రీ హరిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి అర్.డి.ఎస్ హరికృష్ణ,
మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు,
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో
పన్ను వసూళ్ల లో అధిక మొత్తం ,
అత్యధిక శాతం వసూలు చేసినటువంటి
6గురు సచివాలయాల అడ్మిన్ లకు మెమెంటో లను అర్.డి. హరి కృష్ణ,
కమిషనర్ పీ. శ్రీ హరి బాబు, చైర్మెన్ షేక్ రఫానీ చేతుల మీదుగా అందజేశారు,
అదే విధంగా 2024_2025ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల లో చక్కటి ప్రణాళికతోటి 20,సంవత్సరాలుగా వసూలు కానీ మొండి బకాయిలను సైతం వసూలు చేయడంలో సఫలీకృతమైన రెవెన్యూ ఆఫీసర్ పీ.సుబ్బారావు , అర్ ఐ.లు కే గిరిబాబు, అబ్దుల్ ఖాదర్ లకు మేమెంట్ లను అర్,డి,ఎస్ హరి కృష్ణ ప్రత్యేకంగా అందజేసి రెవిన్యూ ఆఫీసర్ పి.సుబ్బారావు కు శాలవతో సత్కరించారు,అనంతరం అర్.డి. హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పన్ను వసూళ్లలో చక్కటి ప్రణాళిక ప్రకారం మొండి బకాయి దారులకు నోటీసులు ఇవ్వడం,పన్ను చెల్లింపుల పై పుర ప్రజలకు అవగాహన కల్పించడంలో సమిష్టిగా టీం వర్క్ చేయడం వల్ల ఎక్కడ వివాదాలకు తావు లేకుండా గతం తో పోలిస్తే అత్యధికంగా 4.5 కోట్లు అదనంగా ఆస్తి పన్ను వసూలు చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు,దీనికి మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఆఫీసర్, రెవిన్యూ ఇనస్పెక్టర్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు,అదే విధంగా పన్ను వసూళ్లలో చక్కటి ప్రతిభ చూపించిన సచివాలయ రెవిన్యూ అడ్మిన్ లు తదితర సిబ్బందికి కూడా శుభాకాంక్షలు తెలిపారు, ఏప్రిల్ నెలలో కూడా ఇదే విధంగా ప్రణాళిక తోటి పన్ను వసూళ్లలో పురోగతి సాధించాలని, సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు,ఈ వేడుకను ఉద్దేశించి రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ ముందుగా మాకు ఇక్కడ పని చేసే అవకాశం కల్పించిన మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు పెద్దలు ప్రత్తిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,తదుపరి ఆయన మాట్లాడుతూ బదిలీ పై వచ్చి బాధ్యతలు చేపట్టిన నాడు ఎమ్మెల్యే గారు ఒక్కటే మాట చెప్పారు పురపాలక సంఘము అభివృద్ధికి కృషి చేయండి. పన్ను బకాయిలు వసూళ్లలో చాక చక్యంగా వ్యవహరించి, వివాదాలకు తావు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించి పన్నుల కట్టే విధంగా చొరవ చూపాలని వారి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ,కమిషనర్ శ్రీ హరిబాబు సూచనలతో రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మేము అందరం కలిసి సమిష్టిగా టీం వర్క్ చేయడం,ముఖ్యంగా వేసవి కాలం,అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపటికీ అర్ ఐ,లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు , తదితర సిబ్బంది పన్నుల వసూలు కోసం కృషి చేయడం జరిగిందని దీనికి మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ కానివ్వండి మిగతా పెద్దలు కానివ్వండి మా విధి నిర్వహణకు పూర్తి సహకారం అందించటం వల్లనే మా ప్రయత్నం కొంతమేర సఫలీకృతం అయిందని పేర్కొన్నారు, ఈ సందర్భంగా అర్.డి. ఎస్. హరికృష్ణ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంతకాలం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో చాలా మంది అర్.డి.లతో కలిసి పని చేయడం జరిగిందని, కొంతమంది అయితే ఆర్థిక సంవత్సర పన్ను వసూళ్ల పై బెంబేలు ఎత్తించే వాళ్ళని, అయిన కానీ పన్ను బకాయిల వసూళ్లు లో పురోగతి ఉండేది కాదని, కానీ దానికి భిన్నంగా అర్.డి.హరికృష్ణ గారు హడావుడి ఖందరగోళం చేయకుండా ప్రభుత్వ మార్గ దర్శకాలను, ప్రభుత్వ లక్ష్యాలను అర్థం అయ్యే విధంగా మార్గ దర్శనం చేసి విధి నిర్వహణలో మాకు అన్ని విధాలుగా స్వేచ్ఛనిచ్చి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అన్ని విధాలుగా పర్యవేక్షణ చేయడం వారి మార్గ దర్శనం లో మేము పని చేయడం,అదృష్టంగా భావిస్తున్నామన్నారు,ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ మాట్లాడుతూ సమర్ధవంతమైన అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే పలితాలు ఈ విధంగా ఉంటాయని గౌరవ మన శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యాలు ప్రత్తిపాటి పుల్లారావు గారు చెప్పే మాటలు అక్షర సత్యాలు అనటానికి నేడు
ఈ అభినందన కార్యక్రమం ఒక నిదర్శనం
అని ఆయన అన్నారు, గడచిన నాలుగు ఏళ్లలో మున్సిపల్ చైర్మన్ గా చాలా మంది అధికారులతో కలసి పని చేయడం జరిగిందని దానికి భిన్నంగా నేడు పురపాలక సంఘము ఆర్థికంగా కొంత లోటుపాట్లు ఉన్నప్పటికీ,ప్రజా సమస్యల పరిష్కారం కావచ్చు,అభివృధి పనులు కావచ్చు, ప్రజా సమస్యల పట్ల స్పందించే విధనం కావచ్చు, మున్సిపల్ అధికారుల పనితీరులో చాలా వ్యత్యాసం స్పష్టంగా గమనించటం జరిగిందని అన్నారు.
ముఖ్యం కమిషనర్ శ్రీ హరిబాబు ప్రజల నుంచి,ప్రజా ప్రతినిధులు నుంచి, పుర ప్రముఖులు,మరియ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న సమస్యల పై స్పందించే విధానం అభినందనీయమని అన్నారు,
ఇకపోతే రెవిన్యూ ఆఫీసర్, రెవిన్యూ ఇనస్పెక్టర్ లు పన్ను వసూళ్ల లో ఒక చిన్న ఫిర్యాదు లేకుండా చిలకలూరిపేట పురపాలక సంఘం చరిత్రలో ఇంతమొత్తంలో పన్ను చెల్లింపులు తేవడం సామాన్యమైన విషయం కాదని
వారికి ప్రత్యేక అభినందనలు , శుభాకాంక్షలు తెలియజేశారు.సభా అధ్యక్షత వహించిన మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు మాట్లాడుతూ గతం కంటే 4.5 కోట్ల రూపాయలు అత్యధికంగా వసూళ్లు చేసినప్పటికీ కొన్ని విలీన గ్రామాల కోర్టు సమస్యలు ,డబల్ ఆసేస్ మెంట్ లు, కోర్టు వివాదాల్లో ఉన్నవి డిమాండ్ లిస్టులో చూపించటం వల్ల పన్ను వసూలు శాతం తక్కువగా కనబడుతుందని. కోర్టు కేసులో ఉన్నందున విలీన గ్రామాల పన్ను బకాయిలు మినహాయించి లెక్కిస్తే ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు 85,నుంచి 88.5 శాతం సుమారుగా ఉంటుందని ఆ విషయం పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు,ఏది ఏమైనప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ సిబ్బంది అధికారులు ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లకు విశేష కృషి చేయడం జరిగిందని,అదే విధముగా కొత్తగా ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల కొత్త అసెస్మెంట్ లు కూడా వేయడం జరిగిందని అన్నారు .దానికోసమే ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని
ఈ కార్యక్రమంలో అర్,డి,ఎస్ హరి కృష్ణ గారు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ,
మెమోంటో లు అందుకున్న అడ్మిన్ సెక్రటరీలు_ రెవిన్యూ సిబ్బంది.
అధిక మొత్తంలో వసూలు చేసిన 2,14,15, సచివాలయ రెవిన్యూ అడ్మిన్ సెక్రటరీలు ముగ్గురు ,2,సాగర్14,నూరు సుల్తాన్, 15,శివయ్య,లకు, అధిక శాతం వసూలు చేసిన..13,28,26,సచివాలయ రెవిన్యూ అడ్మిన్ సెక్రటరీలు ముగ్గురు 13,లోకేష్,28,కిరణ్,26, బ్రహ్మ నాయక్ .లు. రెవెన్యూ ఏ 1సుధ, డి పి ఆర్ ఓ,రామకృష్ణలు,పురస్కార పత్రాలు అందుకున్నారు ,రెవిన్యూ సిబ్బందిలో
.గోపిదేసి గోపి, అబ్దుల్లా,ఎస్, ఏం,సాదిక్ , మోమిన్, జానీ,రామయ్య శ్రీను,జానకి రామయ్య, తదితరులు పురస్కార పత్రాలు అందుకున్నారు . ఈ కార్యక్రమంలో 29 సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
