
అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కాంగ్రెస్ హయంలోనే – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
తెలంగాణ శాసనసభలో బీసీలకు 42 శాతం,ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ, 42 శాతం తో బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత కల్పించడం ఇందుకు నిదర్శనమనీ అన్నారు.
ఈ ప్రభుత్వం ప్రజల మద్దతు పొందిన ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వమని అన్నారు. మహిళలకు ఎన్నో అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టారని, నీరుపేదలైన అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ఉపాధి కల్పించే దిశగా రాజీవ్ యువ వికాసాం పథకం ప్రవేశ పెట్టారని, ఈ పథకం ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, యాదగిరి, ముజీబ్, మహేష్, ఖలీమ్, షకీల్ మున్నా, మోజెస్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, మధులత, రామదాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
