Spread the love

చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని తుర్క చెరువు, శ్రీరామ్ కుంట చెరువులను కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాజీ కార్పొరేటర్లు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. చెరువుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, చెరువుల పరిరక్షణతో సమీప కాలనీవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యావరణ పరిరక్షణ చెందుతుందన్నారు. గత పదేళ్ల కాలంలో మిషన్ కాకతీయ పథకం కింద నియోజకవర్గ పరిధిలోని అనేక చెరువులను అభివృద్ధి పరచామని, రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను అభివృద్ధి పరుస్తామని అన్నారు. అంతకముందు స్థానికంగా గల హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామివారికి, కనకాల మేడలమ్మ దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే
ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ, మేనేజర్ జయరాజ్, పవన్, ఏఈ ప్రవీణ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, బొర్రాదేవి చందు ముదిరాజ్, పెద్ది రెడ్డి సుజాత, బాలాజీ నాయక్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, చంద్రగిరి జ్యోతి సతీష్, ఉపాధ్యక్షులు అజయ్ చౌదరి, 29వ డివిజన్ అధ్యక్షులు నర్సింహ రాజు, నాయకులు సాంబశివరెడ్డి, సీనియర్ నాయకులు ఎస్.కే.ఖాన్, స్వామి, దశరథ్, జస్వంత్, ముత్యాలు, బిక్షపతి, మేకల మధుసూదన్, సండ్ర వెంకటేష్, ప్రదీప్,అజయ్ చౌదరి, దూసకాంటి వెంకటేష్, విష్ణు, ఎన్ఎంసి మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాష్, మహిళా నాయకులు కృష్ణ మంజరి, లత, బాచుపల్లి డివిజన్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.