TEJA NEWS

ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య

ట్రైన్ కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నఘటన ఖమ్మం జిల్లాలోమంగళవారం చోటుచేసుకుంది.

నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో
కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బండి కృష్ణ (39) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కృష్ణ కోసం వెతకగా అప్పటికే ట్రైన్ కింద పడి మృతి చెందాడు.

మృతుడు స్వస్థలం వైరా మండలం రెబ్బవరం.