
ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి, నా పై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద
ఎమ్మెల్యే వివేకానంద తన నివాసంలో తనను కలవడానికి వచ్చిన ప్రజలను తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వివేకానంద ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విని, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యంగా నీటి సరఫరా,నూతన సీసీ రోడ్లు, విద్యుత్, ఆరోగ్య పరిరక్షణ, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర అంశాలపై ప్రజలు ఆయనతో మాట్లాడారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రథమ లక్ష్యం. నాపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను” అని చెప్పారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు.
అనంతరం నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘం నాయకులు, అభిమానులు, తమ ఇంట్లో జరుపుకునే శుభకార్యాలకు మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రావాల్సిందిగా ఎమ్మెల్యే కి ఆహ్వాన పత్రాలు అందజేశారు.
