TEJA NEWS

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆయన చిత్రపటానికి మరియు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి .

అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనందరికీ స్ఫూర్తి. ఆయన మనకు అందించిన ఆదర్శ మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ నాయకులు మేడల మల్లికార్జున్ గౌడ్, పిల్లి నాగరాజు, సంజయ్ జెన్, కరిపే సంతోష్, గుండు రమేష్ గౌడ్, సాయిబాబా, హరీష్, గజ్జల నవీన్ రెడ్డి, రాహుల్, సుక్కల స్వామి, కీసర రామకృష్ణారెడ్డి గొల్లూరి ప్రభాకర్, అమీర్, తదితరులు పాల్గొన్నారు.