
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన………… జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు
వనపర్తి
వినియోగదారులు తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మార్చి 15, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్లోని పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో వినియోగదారులకు హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వినియోగదారులు ఎక్కడైనా ఏవైనా వస్తువులు కొనేటప్పుడు వాటి నాణ్యత ప్రమాణాలు,
ఎక్స్పైరీ డేట్ వంటివి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ వేదికగా చాలా మోసాలు జరుగుతున్నాయని, ఒకవేళ వినియోగదారులు ఏదైనా కొనుగోలు చేసి మోసపోయినట్లయితే ఆన్లైన్ ద్వారానే వినియోగదారుల ఫోరంను సంప్రదించవచ్చు అని చెప్పారు.
డిజిటల్ విధానం ద్వారా వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చని, అదేవిధంగా వర్చువల్ హియరింగ్ ద్వారా సకాలంలో సత్వర న్యాయం పొందవచ్చు అని చెప్పారు. ఈ సేవల విషయంలో అందరూ అవగాహన కలిగి వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, డీటీ లు, ఇతర అధికారులు, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.
