
కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్.
( ఏపీ జేఏసీఅమరావతి అనుబంధం)
కూటమి ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు మెరుగైన విధానాన్ని తీసుకురావాలి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను డిపార్ట్మెంట్లకు అప్పచెప్పే విషయం స్వాగతిస్తాం…మళ్లీ దళారి (ప్రైవేటు ఏజెన్సీలు) వ్యవస్థ నడిపితే ఉద్యోగులు అధోగతి పాలవుతారు.
స్పెర్స్, మెప్మా ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి..నూతన విధానంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా కల్పించిలే చర్యలు తీసుకోవాలి.
. కూటమి ప్రభుత్వంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోటి ఆశలు పెట్టుకున్నారు..వారి ఆశలు అడియాశలు కాకుండా చూడాలి.ఆప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేస్తారని నమ్మకంతో ఉన్నాం: ఏపీ సి ఓ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు కే. సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు.
విజయవాడ: ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసినా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు మరింత మెరుగైన విధానాన్ని తీసుకుని వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉద్యోగులకు న్యాయం చేయాలని కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కే సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, అసోసియేట్ అధ్యక్షులు జి సంపత్ కుమార్, కోశాధికారి రమణమూర్తి కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు వారు నిన్నటి రోజున జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వరకు నడపబడుతున్న ఆప్కాస్ వ్యవస్థ రద్దు విషయం చర్చకు వచ్చిన సంగతి, అలాగే వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు చూసిన అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కూటమి ప్రభుత్వానికి అనేక విషయాలు విన్నవిస్తూ శుక్రవారం అత్యవసరంగా జరుపుకున్న రాష్ట్రకమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పత్రికా ప్రకటన విడుదల చేసారు.
ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థను రద్దు చేయాల్సి వస్తే మెరుగైన వ్యవస్థను తీసుకుని వచ్చి రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలకు కీలక శాఖలో సైతం పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ వ్యవస్థను నూతన నియామకాలను అన్ని అధికారాలను ఆయా డిపార్ట్మెంట్లకు అప్పజెప్పే విషయాన్ని అందరూ స్వాగతిస్తున్నామని అయితే మధ్యవర్తులు అనగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పకుండా గత వ్యవస్థ (ఆప్కాస్) కంటే మెరుగ్గా ఉండేటట్లు మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆప్కాస్ లో ఉన్నవారికి ఇంతవరకు ఆప్కాస్ లో లేకుండా దళారిమధ్య నలిగి పోతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అక్కున చేర్చుకోవాలని వారు కోరారు. మరల దళారీ వ్యవస్థ (ప్రవేటు ఏజెన్సీలు) ఏర్పాటు అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు అధోగతి పాలు అవుతాయని దీనివలన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా వ్యవస్థ డిపార్ట్మెంట్లకు ద్వారా నడపడం మంచిదని వారు తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ,స్పెర్స్ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఏ విధంగా అయితే హెచ్ఆర్ పాలసీ అమలు అవుతుందో ఆ విధంగా అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చే నూతన విధానంలో హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగులందరికీ న్యాయం చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.
ముఖ్యమంత్రి . నారా చంద్రబాబు నాయుడు పై అలాగే వారి మంత్రి వర్గంపై ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అపార నమ్మకం ఉందని వారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వ్యవస్థ అనగా మంచి ఫలితాలు సాధించే వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్లడాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున స్వాగతిస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నూతన విధానంలో భరోసా భద్రత కల్పిస్తూ న్యాయం చేయాలని కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారని ,మంచి పాలనాధ్యక్షుడిగా పేరున్న ముఖ్యమంత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చొరవ చూపి గతంలో ఉండే వ్యవస్థ కంటే మెరుగైన వ్యవస్థ ఏర్పాటు చేస్తారన్న రాష్ట్ర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఉందని నూతన వ్యవస్థలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి ని వారి మంత్రివర్గ సహచరులను ఎమ్మెల్యేలను రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కోరుకున్నట్లు సుమన్ ,సురేష్ బాబు, సంపత్ కుమార్, రమణమూర్తి తెలిపారు.
ధన్యవాదాలతో…
కె.సుమన్
అల్లం సురేష్ బాబు.
