Spread the love

జిల్లా పరిషత్ హైస్కూల్ లో విజ్ఞాన ప్రదర్శన – విద్యార్థుల ప్రతిభకు కార్పొరేటర్ ప్రశంసలు
హైదర్ నగర్ డివిజన్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్ (Z.P.H.S) లో నేడు 13 – 03- 2025 నాడు వైభవంగా విజ్ఞాన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను 123 – హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస రావు గారు సందర్శించి విద్యార్థుల ప్రతిభను, నైపుణ్యాన్ని కొనియాడారు.
వివిధ అంశాలపై విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలు, ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి, ముఖ్యంగా, పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి, సాంకేతిక ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఇంజనీర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభను మరింత మెరుగుపరచవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి కుమార్ ప్రిన్సిపాల్, విద్యార్థులు, మరియు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.