
కొడుకుని కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న ఎమ్.డి మహబూబ్ పెద్ద కుమారుడు సమీర్ (25 సంవత్సరాలు) ఈ నెల 11 వ తేదీన కారులో వెళ్తుండగా సంగారెడ్డి ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇట్టి విషయమై చింతిస్తూ మహబూబ్ కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆక్సిడెంట్ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పరిధికి రావడంతో కార్పొరేటర్ CI కి ఫోన్ చేసి ఆక్సిడెంట్ వివరాలు తెలుసుకున్నారు. చిన్న వయస్సులో వ్యాపారంలో కోటి రూపాయల వరకు కుటుంబానికి సంపాదించిపెట్టిన చెట్టంత కొడుకు పోయి బాధపడుతున్న సమీర్ అమ్మా నాన్నలకు, తమ్ముడు, చెల్లికి కార్పొరేటర్ ధైర్యం చెప్పి. ఎల్లప్పుడూ ఏ ఆపదా వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పారు. కాలనీ ప్రెసిడెంట్ గుడ్ల శ్రీనివాస్, రవి, ధనుంజయ, మల్లేష్, బాలాజీ నాయక్, బాలు నాయక్, శ్రీనివాస్, రంజిత్, రమేష్ తదితరులు ఉన్నారు.
