TEJA NEWS

UGD నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో జన నివాసాలు పెరిగి డ్రైనేజీ వ్యవస్థ సరిపోకపోవడంతో నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అన్నారు. డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మరేళ్ల శ్రీనివాస్, జి.రవి, పోశెట్టిగౌడ్, నాగేష్ గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.