TEJA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అనాలోచిత నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేయడంపై ప్రభుత్వ పాలన తీరును ఎండగడుతూ బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మీడియా ముఖంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు కోర్టులు
తప్పు పడుతూనే ఉన్నాయి.

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం
రావడమే అబద్ధాల
పునాదులపై వచ్చింది.

ప్రజలనే కాదు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

సీఎం ఫ్రస్టేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అనడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. అనాలోచితనిర్ణయాలు,
అనుభవరాహిత్య
నిర్ణయాలతో ప్రజలు
ఇబ్బంది పడుతున్నారు.

రెండు ఏళ్ళు అవుతున్న
ఇంకా ఏం అభివృద్ధి చేయకుండా బిఆర్ఎస్ పై బురద చల్లుతున్నారు.

ఇప్పటికే గత ప్రభుత్వంపై పదికి పైగా ఎంక్వరీలు
వేశారు ఎక్కడ ఏం రుజువు చేయలేదు.

ఇప్పుడు మళ్ళీ ధరణి ఫోరెన్సిక్ అడిట్ అని మళ్ళీ ఇంకో ఎంక్వైరీ వేస్తారట.

ఇకనైనా ఆరోపణలు మాని పని చేయాలని సూచిస్తున్నాను.