
కూల్చడంతో పాటు అరెస్టులు చేయండి .
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
జగద్గిరిగుట్ట సర్వేనెంబర్ 348 /1 లో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వెంటనే వాటిని కాపాడాల్సిందిగా నేడు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఎమ్మార్వో రాజేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు ఎమ్మార్వో కి జగద్గిరిగుట్ట 348/1 లో జాంబవంతుని గుడి స్థలంలో గతంలో కూల్చివేసినప్పటికీ మళ్లీ మళ్లీ నిర్మాణాలు సాగుతున్నాయని, ఇలాగా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని కావున కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన స్థలాలను హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని లేకపోతే ఉన్న ప్రభుత్వ భూమి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వెళ్లే ప్రమాదం ఉందని దానివల్ల భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అనేది లేకుండా పోతుందని అన్నారు. రాజీవ్ గృహకల్ప లోని షాపింగ్ కాంప్లెక్స్ కేటాయించిన భూమిని కూడా పట్టాలు ఉన్నాయని నెపంతో ఆక్రమించుకుంటున్నారని ఆ పట్టాలు నిజమో కావొ తెలుసుకొని ఫేక్ పట్టాలో సూచించిన వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, సోమయ్య నగర్ సలాసర్ స్థలం అనుకొని చిన్న ప్లాట్లుగా చేసి అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతుందని, వేద పాఠశాల నుండి వెళ్లే దారి పక్కన స్థలాలు కూడా ఆక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని కూల్చివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మండల కార్యదర్శి స్వామి సహాయ కార్యదర్శి రాములు ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మండల కోశాధికారి సదానందలు పాల్గొన్నారు