
సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటనను విజయవంతం చేయండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ పిలుపు.
ఈనెల 20న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మేడ్చల్ జిల్లా కౌన్సిల్,కార్యవర్గ సమావేశాల సందర్భంగా వస్తున్నారని కావున సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా గాంధీనగర్ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది.
ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు మరియు కౌన్సిల్ సభ్యులు మరియు మండల కార్యదర్శులు పాల్గొని భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన చర్చిస్తారని అదేవిధంగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి, జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కబ్జాకు గురవుతున్నటువంటి ప్రభుత్వ భూములు, చెరువులు వాటి పరిరక్షణ కొరకు ఏర్పడినటువంటి హైడ్రా పని తీరు పైన కూడా చర్చిస్తారని అన్నారు. జిల్లాతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చర్చలు ఉంటాయని కుదిరితే నియోజకవర్గంలో కబ్జాలకు గురవుతున్నటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వ చెరువులను సందర్శిస్తారని,
ముఖ్యంగా పరికిచెరువును గాజులరామారంలో అన్యాక్రాంతమవుతున్నటువంటి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను సందర్శిస్తారని అదేవిధంగా ప్రభుత్వం కబ్జాదారులకు సహకరిస్తూ పేదవాళ్లు గుడిసె లేస్తే మాత్రం తొలగిస్తున్నారని రాబోవు రోజుల్లో గతంలో గుడిసెలు వేసుకున్నటువంటి పేదవాళ్ళందర్నీ సమీకరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వేలాదిమంది ఇండ్లు లేని వాళ్లను సమీకరించి ఇక్కడి నుంచి పాదయాత్రగా హైకోర్టుకు వెళ్లి అక్కడే ప్రజలందరి తరఫున న్యాయమూర్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి కబ్జాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా అనేక అంశాల పైన కూడా చర్చలు జరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని హరినాథ్ రావు జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసయ్య శాఖ కార్యదర్శి యాకూబ్ నాయకులు కుమార్,పూర్ణచందర్ పాల్గొన్నారు.
