
సిపిఎం, సిఐటియు కుతుబుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు
ఈ సందర్భంగా. మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యాన్ని రక్షించు కోవాలని. షాపూర్ నగర్ రైతు బజార్ నుండి ఉషోదయ టవర్స్ మీదుగా జీడిమెట్ల బస్ డిపో వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం జీడిమెట్ల డిపో దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఈ దేవదానం, సిఐటియు జిల్లా నాయకులు పసుల అంజయ్య పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగానికి మన పాలకులు వాళ్లకు అనుకూలంగా రాజ్యాంగానికి సవరణలు చేసి దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు, విద్యా వైద్యం, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని, దేశ సంపద మొత్తం కార్పోరేట్ కంపెనీల యజమానులకు కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారతదేశ రాజ్యాంగాన్ని, భారత లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు శ్రీనివాస్ నగర్ లో సిఐటియు సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జి వెంకన్న, డి కరుణాకర్ సిఐటియు మండల నాయకులు కే శీను మల్లారెడ్డి, పాషా, వీరేష్, దుర్గా నాయక్, సాయి, మధు, చంద్రకాంత్ దిగంబర్, మారుతి దీపక్, , ఆటో యూనియన్ నాయకులు ఖలీల్, షఫీ, వజీర్, జహీర్,
తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
కీలు కానీలక్ష్మణ్
