పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని …..సిపిఎం నిరసన

TEJA NEWS

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని …..సిపిఎం నిరసన

వనపర్తి :

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలనీ
సిపిఎం పార్టీ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలోనిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్ లుపాల్గొని మాట్లాడుతూ
ఆదివారం రోజు రాత్రి ఒక లీటర్ పెట్రోల్ పై,2,రు,61,పై, డీజిల్ పై, 2,రు,71,పై, పెంచి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం రెండు రోజులకు ఒకసారి గత పది రోజుల నుండి పెట్రోల్ పై లీటరుకు 8 రూపాయలు డీజిల్ పై లీటర్ కు 8 రూపాయలు పెంచినకేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రోల్ పేరుతో భారాలను మోపుతూ మధ్యతరగతి ప్రజలకు భారంగా వ్యవహరిస్తున్న తీరు నిత్యవసర వస్తువులపై రైతులపై బారంగా మారింది దేశంలో ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచని మోడీ సర్కార్ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ధరలు పెంపుకు సిద్ధపడి పెంచుతూ వస్తుంది దేశ ప్రజలపై భారం మోపుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ట్యాక్స్ తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు, డి, కురుమయ్య ,18 వ వార్డు కౌన్సిలర్ ,గంధం మదన్ జి ,బాలస్వామి ,గంధం గట్టయ్య, ఏ ,రమేష్,జి, బాలరాజు, నందిమల్ల రాములు,పుల్లయ్య, రాబర్ట్, కురుమయ్య, మద్దిలేటి, వీరేందర్, మన్యం, డి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top