Spread the love

సీపీఎం సీనియర్‌ నాయకుడు అంబికా ప్రసాద్‌ మిశ్రా కన్నుమూత

సీపీఎం సీనియర్‌ నాయకుడు అంబికా ప్రసాద్‌ మిశ్రా కన్నుమూత
సీపీఎం సీనియర్‌ నాయకులు, ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ కార్మికోద్యమ నేత అంబికా ప్రసాద్‌ మిశ్రా శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం విభాగానికి చాలా ఏళ్ళు ఆయన నేతృత్వం వహించారు. ఆయన పార్టీలోనూ పలు నాయకత్వ స్థానాల్లో కీలక పాత్ర పోషించారు. అంబికా ప్రసాద్‌ మృతి పట్ల సిపిఎం కేంద్ర కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.