Spread the love

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు

మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పునర్° ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడిరైతులు సుమారు 20 వేల మందికి జీవనాధార మైన అగ్రహారం పాలశీతలీ కరణ కేంద్రాన్ని సీజ్‌ చేయ డంపై గురువారం రాత్రి పాడి రైతులు బొగ్గుమ న్నారు.

పాలకేంద్రం ఎదుట హైవే పై వందలాది మంది రైతులు సుమారు 3 గంటలకుపైగా రాస్తారోకో నిర్వహించారు. రాత్రి సమయంలో గ్రామాల్లోని పాలకేంద్రాల వద్ద నిరసనలకు దిగారు. పలుచోట్ల పాలు పారబోసి రైతు కుటుంబాలు ఆందోళనలకు దిగారు. దీంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ప్రభుత్వ అధికారులు.. రాత్రి 9 గంటలకు మళ్లీ పాలకేంద్రాన్ని తెరిచారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం చంద్రగిరి పంచాయతీ పరిధిలోని అగ్రహారం వద్ద కరీంనగర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ పాలశీతలీకరణ కేంద్రాన్ని అధికారులు ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే సీజ్‌చేశారు.

ఇది అధికార యం త్రాంగం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని, అధికార పార్టీ నేతల కనుసైగతోనే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినదించారు. మూడు గంటలపాటు ధర్నా చేయగా, అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచి పోయాయి. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్‌, డీఆర్డీఏ శేషాద్రి వారిని సముదా యించే ప్రయత్నం చేయగా.. ఎటు వంటి నోటీసు ఇవ్వకుండా నే పాల కేంద్రాన్ని ఎలా సీజ్‌ చేస్తారని అధికారులను నిలదీశారు.

ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేస్తున్నామని, విజయ డెయిరీకి పోయాలని ఆర్డీవో రాజేశ్వర్‌ సూచించగా, రైతులు మండిపడ్డారు. బయటనైనా పారబోస్తాం గానీ, విజయ డెయిరీకి పోసేది లేదని తేల్చిచెప్పారు.

రాజకీయ కక్షతోనే అధికా రులు తమ పాలకేంద్రాన్ని సీజ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుం దని రైతులను పోలీసులు ఈడ్చుకెళ్లి రోడ్డుపక్కన పడేసి, ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.