
దళిత ఎంపీ గడ్డం వంశీ విస్మరణపై నిరసన – యూత్ కాంగ్రెస్, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి*
మంచిర్యాలలో యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా కార్యకర్తల ఆధ్వర్యంలో, ఇటీవల సరస్వతి పుష్కరాల సందర్భంగా దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరును అధికారికంగా ప్రస్తావించకపోవడం, ఫ్లెక్సీల్లో ఆయన ఫోటోను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమానికి ముందుగా పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ .పోలీసులు ఎలాంటి సహకారం అందించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వినతిపత్రం ఇవ్వకుండా స్థానిక కొన్ని రాజకీయ నాయకులు యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా కార్యకర్తలపై గొడవకు దిగారని, వారిని అక్కడి నుంచి నెట్టి వేసే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఈ ఘటనపై దళిత సంఘాలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్య విలువలకు, దళిత గౌరవానికి తూట్లు పొడిచే చర్యగా అభివర్ణించారు. బాధ్యత వహించాల్సిన పోలీస్ మరియు అధికారులు మౌనంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తమైంది.
వెంటనే దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
