
అద్దంకి వారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న దారపనేని
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పోతవరం గ్రామ వాస్తవ్యులు అద్దంకి నాగమల్లేశ్వరరావు శ్రీమతి లక్ష్మి దంపతుల కుమార్తె విజయలక్ష్మి పుష్పాలంకరణ వేడుక విజయవాడలోని వారి స్వగృహం నందు ఘనంగా నిర్వహించారు. ఈ పుష్పాలంకరణ వేడుకలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని విజయలక్ష్మిని అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఉమామహేశ్వరరావు, ప్రకాష్, చిన్నారావు, తిరుపాలు, మాల్యాద్రి, మల్లికార్జున, మహేష్, నాగరాజు, చీర్లదిన్నె సుబ్బారావు, నాగభూషణం అద్దంకి వారి కుటుంబ సభ్యులు, నాదెళ్ల వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని విజయలక్ష్మిని అక్షింతలతో ఆశీర్వదించారు.
