
పారా వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న దారపనేని ,బైరెడ్డి
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు పారా వెంకటేశ్వర్లు, శ్రీమతి సరస్వతి దంపతుల కుమార్తె వెంకట నాగ దివ్య ను మండలంలోని చిలంకూరు గ్రామ వాస్తవ్యులు మలినేని శ్రీనివాసులు (లేట్) లక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు శ్రీకాంత్ ల ప్రథానం కార్యక్రమం గురువారం కొండారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ ప్రథానం కార్యక్రమంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పాల్గొని వధువు వెంకట నాగ దివ్య ను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో టిడిపి మండల పార్టీ ఉపాధ్యక్షులు రెక్కల రమణారెడ్డి, వగ్గంపల్లి టిడిపి నాయకులు, వగ్గంపల్లి మాజీ ఉప సర్పంచ్ చావా సుబ్బారావు, బైరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, సాగాని వెంకటయ్య, పారా వారి కుటుంబ సభ్యులు, మలినేని వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని వధువును అక్షింతలతో ఆశీర్వదించారు.
