Spread the love

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన దారపనేని

కనిగిరి

కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనదని,శివపార్వతుల వివాహం జరిగిన రోజు మహాశివరాత్రి అని, పరమశివుడు కైలాస పర్వతంతో ఒకటై పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా మారిన రోజు అని, మహాశివరాత్రి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణంతో మారుమ్రోగుతాయని, భైరవకోన, మిట్టపాలెం నారాయణస్వామి, నియోజకవర్గంలోని శివాలయాలలో భక్తులు శివపార్వతులను దర్శించుకుని పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులు కాగలరని దారపనేని ఆకాంక్షించారు.