
కాకు వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న దారపనేని
శ్రీ కాకు సత్యనారాయణ శ్రీమతి బాల వెంగమ్మ దంపతుల కుమారుడు చిరంజీవి హరికృష్ణ, కనపర్తి కొండలరావు శ్రీమతి రమాదేవి దంపతుల ఏకైక కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి సుదర్శిని ల వివాహ వేడుకలు విజయవాడలోని సాయి జ్యూయల్ నందు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకల్లో మానం మల్లికార్జున రావు దంపతులు, మానం కిరణ్ దంపతులు, మానం రాజకుమార్ దంపతులు, నూతలపాటి వెంకటేశ్వర్లు దంపతులు, రాములు దంపతులు, లక్ష్మణ దంపతులు, మర్రి నారాయణ దంపతులు, మానం వారి కుటుంబ సభ్యులు, నూతల పాటి వారి కుటుంబ సభ్యులు, మర్రి వారి కుటుంబ సభ్యులు, కాకు వారి కుటుంబ సభ్యులు, కనపర్తి వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు
