
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తాత్రయ కాలనీ మరియు పి.జే.ఆర్ నగర్ కాలనీలో నిర్వహించిన SIR (Special Intensive Revision) కార్యక్రమాన్ని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా బిఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో వారి పూర్తి వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కును పరిరక్షించుకోవటం మన భాద్యత అని తెలిపారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులు కుడా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేసారు. ఇది మీ ఓటు హక్కును తీసివేయడానికి కాదు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు సరైన వివరాలతో ఓటరు జాబితాలో ఉండేలా చేయడమే దీని ఉద్దేశ్యం అని అన్నారు. డివిజన్ లోని ప్రజలందరూ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు, “SIR” కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న సేవలు మరియు అవకాశాలను సద్వినియోగ పరుచుకోవటం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.
డివిజన్ ప్రజలు అందరికి ప్రత్యేకంగా యువతకు తెలియజేయటం ఏమనగా, తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించండి, పేరు లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి, వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే సవరించుకోండి,అలాగే మీ కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగువారు అందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చైతన్యం కల్పించండి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాండుగౌడ్, జగదీష్, పోశెట్టిగౌడ్, సౌందర్య, చారి, C.O ముస్తఫా, BLO లు తదితరులు పాల్గొన్నారు.