Spread the love

ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం..
పండగల సెలవుల కారణంగాగడువు పొడిగింపు అవసరం………. సిపిఐ

వనపర్తి
యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎమ్మార్వో ఆఫీసుల్లో ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, పండగ సెలవుల కారణంగా గడువును పొడిగించాలని సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ రెవిన్యూ అధికారులను కోరారు. సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధికి యువ వికాస పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షినియమన్నారు. అయితే దరఖాస్తుకు చివరి గడువు ఏప్రిల్ 5వ తేదీ ని ఖరారు చేయడం జరిగిందని . యువ వికాస పథకానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు, రేషన్ కార్డ్ లేదా ఆదాయం సర్టిఫికెట్ జత చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టిందన్నారు. కొత్త రేషన్ కార్డులను ఇవ్వని కారణంగా చాలామంది అభ్యర్థులకు రేషన్ కార్డులు లేవన్నారు. ఆదాయం సర్టిఫికెట్ ఎమ్మార్వో ఆఫీస్ నుంచి తీసుకోవాలని, సాంకేతిక కారణం వల్ల వనపర్తి ఎమ్మార్వో ఆఫీస్ లలో ప్రభుత్వ సైట్ పనిచేయక సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు.

వనపర్తి ఎమ్మార్వో ఆఫీస్ లో గత మూడు రోజులుగా సైట్ పనిచేయక వెయ్యి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తాసిల్దార్ ను సంప్రదిస్తే రాష్ట్రవ్యాప్తంగా సైట్ సమస్య ఉందని చెబుతున్నారన్నారు. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోందన్నారు. అంతేగాక మార్చి 30న ఉగాది పండుగ, మార్చి 31న రంజాన్ పండుగ ఆఫీసులకు సెలవులు అన్నారు. ఈ కారణం వల్ల ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు గడువులోగా తీసుకునే పరిస్థితి కనిపించక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించాలన్నారు. దరఖాస్తు చేసుకునే ఆసక్తి ఉన్న అందరికీ అవకాశం కల్పించాలన్నారు. అంతేగాక యువ వికాస పథకంలో కొన్ని వ్యాపారాలను చేర్చ లేదన్నారు. కుండల తయారీ, తట్టలు పొరకల తయారీ తదితర వ్యాపారాలు వికాస పథకం స్కీం లో పెట్టలేదని, పెట్టాలన్నారు. గతంలో కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసిన కొందరికి రుణాలు రాలేదన్నారు. కానీ వారి పేర్లు ఆన్లైన్లో ఉన్నాయని, దరఖాస్తు చేసుకునేందుకు వెళితే ఆన్లైన్ యాక్సెప్ట్ చేయడం లేదని, సమస్య పరిష్కరించాలని కోరారు. ‌సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణ, పృథ్వి నాదం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎత్తం మహేష్, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశి, ప్రసాద్, సిపిఐ సీనియర్ సీనియర్ నేత చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.