TEJA NEWS

శ్రీశైలం పరమశివుడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి(Srisailam) భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. పాతాళగంగలో భక్తులు పున్య స్నానాలు ఆచరించి.. క్యూ లైన్లలో నిలుచుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ నెలకొంది.

ఆలయ అధికారులు శివ స్వాములకు ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు.నల్లమల అడవుల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం మల్లన్న భక్తులకు లడ్డూ ప్రసాదం, మంచినీరు, చిన్న పిల్లలకు పాలు అల్పాహారం ఉచితంగా పంపిణీ చేస్తోంది.

రాత్రి పది గంటలకు పాగాలంకరణ, అర్ధరాత్రి శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్బంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.